హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ‘జీవో 317’ ప్రభావిత ఉద్యోగుల్లో కొందరికి క్యాబినెట్ సబ్ కమిటీ ఊరట కలిగించింది. మంత్రి దామోదర నేతృత్వంలోని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కూడిన కమిటీ గురువారం సచివాయలంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది.
స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాఖాధిపతులకు పంపాలని జీఏడీ అధికారులను ఆదేశించిం ది. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగా లిచ్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 18న కమిటీ మరోసారి భేటీ కానున్నది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్‌రావు, పీఆర్సీ చైర్మన్ శివశంకర్ పాల్గొన్నారు.
పాఠశాల విద్య డైరెక్టర్‌తో ఎమ్మెల్సీ ఏవీఎన్ భేటీ
హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెంకటనర్సింహారెడ్డితో ఎమ్మెల్సీ ఏవీ నర్సింహారెడ్డి గురువారం సమావేశమమై టీచర్ల బదిలీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పాఠశాల విద్యాశాఖలో పదోన్నతుల తర్వాత మిగిలిన ఖాళీలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పలు సమస్యలతో కూడిన వినతిప్రతం సమర్పించారు.