హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ లభించింది. ఐఆర్ఆర్, లిక్కర్ కేసు, ఇసుక కేసుల్లో ఆయనకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కేసుల గురించి మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో అరస్టై బెయిల్‌పై బయటకొచ్చారు.
లిక్కర్ స్కామ్ కేసులో టీడీపీ నేత కొల్లు రవీందర్‌కు కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఇసుక, లిక్కర్ వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం విచారణ జరిపిన హైకోర్టు మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.