Group-2 | 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం ఊరటనిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను ఇటీవల న్యాయమూర్తి నగేష్ భీమపాక నేతృత్వంలోని హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల సమయంలో హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని పేర్కొంది. టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందని న్యాయమూర్తి.. తిరిగి మూల్యాంకనం చేయాలని బోర్డును ఆదేశించారు. ఆ తర్వాత మళ్లీ అర్హుల జాబితాను ప్రకటించాలని చెప్పారు. ఎనిమిది వారాల్లోగా పునః మూల్యాంకరనం జరుగాలని.. జాబితా ప్రకటన ప్రక్రియ ముగించాలని సూచించారు. అయితే, సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ పలువురు సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఇరువర్గాల వాదనలు విన్న సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఆదేశాలను పక్కన పెట్టింది.
పదేళ్ల కిందట అంటే.. 2015-16లో 439 పోస్ట్‌లకు గ్రూప్ 2 పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్సీ.. 2016 నవంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించింది. అయితే.. ఈ పరీక్షలో కొందరు వైట్నర్ ఉపయోగించారంటూ పలువురు కొందరు అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, టీజీపీఎస్సీ వెనక్కి తగ్గకుండా.. 2019లో నియామకాలు చేపట్టింది. నియామకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వైట్నర్, దిద్దుబాటు ఉన్న ప్రశ్నప్రత్రాలను మూల్యంకనం చేయడంపై హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. అలానే ట్యాంపరింగ్ జరిగినట్టు తెలిసినా సరే మూల్యంకనం చేయడం చట్టవిరుద్ధమని న్యాయమూర్తి అభిప్రాఆయపడ్డారు. సాంకేతిక కమిటీ సూచన ప్రకారం అప్పటి ప్రశ్నపత్రాలను తిరిగి మూల్యంకనం చేయాలని ఆదేశాలు బెంచ్ ఆదేశించింది.