హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): గ్రూప్-4 సర్టిఫికెట్ వెరిఫికేషన్ జాబితాను విడుదల చేసినట్టు టీజీపీఎస్సీ ఆదివారం తెలిపింది. సంస్థ వెబ్సైట్లో జాబితాను పొందుపరిచామని పేర్కొన్నది. ఎంపికైన అభ్యర్థులు చెక్లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. వెబ్ ఆప్షన్లతోపాటు లోకల్, అన్ రిజర్వ్డ్ క్యాటగిరీల వారీగా వివరాలు పొందుపరిచినట్టు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంతోపాటు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. అభ్యర్థులకు ఈ నెల 13వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్ల లింక్ అందుబాటులో ఉన్నట్టు పేర్కొన్నారు.