Free electricity | వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ అందించాలని రిలే నిరాహార దీక్షలు
Free electricity | సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్‌ను(Free electricity) అందించాలని సిరిసిల్ల(Sirisilla) పవర్‌లూం వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల సమాఖ్య(జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు.
సిరిసిల్ల టౌన్, జూలై 22: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్‌ను(Free electricity) అందించాలని సిరిసిల్ల(Sirisilla) పవర్‌లూం వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల సమాఖ్య(జేఏసీ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వస్త్ర పరిశ్రమకు సంబంధించిన పలు డిమాండ్లతో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ సమీపంలో రిలే నిరాహార దీక్షను(Relay hunger strike) చేపట్టారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఆరు నెలలుగా వస్త్ర పరిశ్రమ ఉపాధిని కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వస్త్ర పరిశ్రమకు ఉచిత విద్యుత్ అందించాలన్నారు. జనతా వస్త్ర పథకాన్ని అమల్లోకి తేవాలని కోరారు. 10శాతం యారన్ సబ్సిడీ అందించడంతో పాటు త్రిఫ్ట్, నేతన్న బీమా పథకాలను యథావిధిగా కొనసాగాలన్నారు. యారన్ కొనుగోలుపై సబ్సిడీని అందించాలని కోరారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షుడు తాటిపాముల దామోదర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు కట్టెకోల లక్ష్మీనారాయణ, ఆసాముల సంఘం అధ్యక్షుడు సిరిసిల రవీందర్, డయింగ్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కోడం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

