యాదాద్రి, సెప్టెంబర్ 12 : యాదగిరిగుట్టలో స్వామి, అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజాపర్వాలు శాస్ర్తోక్తం గా జరిగాయి. తెల్లవారుజామున స్వా మివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, ఉద యం, సాయంత్రం సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొన్నారు. పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో నూతనంగా ప్రతిష్ఠించిన స్పటిక లింగేశ్వరుడికి ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామివారిని 11,632 మంది భ క్తులు దర్శించుకోగా, రూ.13,39,416 ఆదాయం వచ్చినట్టు ఈవో తెలిపారు.