హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): 2030 నాటికి జిల్లా కేంద్రాల్లోనే పూర్తిస్థాయిలో రీజినల్ క్యాన్సర్ సెంటర్లను అందుబాటులోకి తేనున్నట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. మంగళవారం సంగారెడ్డి మెడికల్ కాలేజీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రభుత్వ జనరల్ దవాఖానల్లో ఏర్పాటుచేసిన డిస్ట్రిక్ట్ డే కేర్ క్యాన్సర్ సెంటర్లను మంత్రి వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు.
ఆర్టీసీ ‘యాత్రాదానం’ వినూత్నం: పొన్నం
హైదరాబాద్, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ‘యాత్రాదానం’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ తెలిపారు. అనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రలకు తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని చెప్పారు.