తీర్పునకు లోబడి కూకట్పల్లి 300 ఎకరాలు
కూకట్‌పల్లిలో జీవోసీఎల్ కార్పొరేష న్, హిందూజా ఎస్టేట్స్, స్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీ, ఆనర్ హోమ్స్ తదితర సంస్థలకు చెం దిన సుమారు 300 ఎకరాల భూముల విక్రయ లావాదేవీలపై మధ్యంతర స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
- కోట్ల విలువైన భూముల విక్రయాలపై స్టేకు నిరాకరణ
- మూడు వారాల్లో రికార్డులు సమర్పించాలి
- ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): కూకట్‌పల్లిలో జీవోసీఎల్ కార్పొరేష న్, హిందూజా ఎస్టేట్స్, స్వేర్ స్పేస్ ఇన్ఫ్రా సిటీ, ఆనర్ హోమ్స్ తదితర సంస్థలకు చెం దిన సుమారు 300 ఎకరాల భూముల విక్రయ లావాదేవీలపై మధ్యంతర స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ భూములకు సంబంధించి జరిగే అన్ని లావాదేవీలు పిటిషన్‌పై వెలువరించబోయే తుది తీర్పునకు లోబడి ఉంటాయని షరతులు విధించింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ బుధవారం మధ్యంతర ఆదేశాలు జారీచేశా రు.
బోడుప్పల్‌కు చెందిన వ్యాపారవేత్త చిం తల శ్రీనివాస్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పాశం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రైవేట్ సంస్థలు రెవె న్యూ అధికారులతో కుమ్మకై అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో స్టాంపు డ్యూటీ రూపంలో ప్రభుత్వానికి రూ.466 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు.
జీవోసీఎల్ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..1966 నుంచి 1975 మధ్యకాలానికి చెందిన రికార్డుల ప్రకారం ఆ భూములు కొనుగోలు లేదా చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నవేనని చెప్పారు. ఆనర్ హోమ్స్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదిస్తూ ఈ రిట్ పిటిషన్‌ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వానికి మూడు వారాల గడువు మంజూరు చేసి, సంబంధిత రికార్డులు సమర్పించి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెరువు అలుగు నీటిని మళ్లించొద్దు… పైప్‌లైన్ అనుమతిని రద్దు చేయాలి
Transfers | రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

