హైదరాబాద్ : తెలంగాణలో మద్యం ప్రియులకు ఊరట లభించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కొన్ని మద్యం( Liquor) ధరలను తగ్గిస్తూ ( Reduce prices)ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 180 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 10, 375 మిల్లిలీటర్ బాటిల్‌పై రూ. 20, 750 మిల్లిలీటర్బాటిల్పై రూ. 40ను ప్రభుత్వం తగ్గించింది. అయితే బీరు(Beer) ధరల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయలేదు. ఈ తగ్గించిన ధరలు సోమవారం నుంచి కొత్తగా కొనుగోలు చేసిన మద్యం బాటిళ్లపై వర్తిస్తాయని తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గజ్జెల నాగేశ్ వెల్లడించారు.