న్యూఢిల్లీ : దేశంలో సెప్టెంబరులో విద్యుదుత్పత్తి తగ్గింది. నిరుడు సెప్టెంబరుతో పోల్చితే 3.2 శాతం పెరిగింది. కానీ ఈ ఏడాది ఆగస్టులో ఈ పెరుగుదల 4 శాతంతో పోల్చినపుడు సెప్టెంబరులో తగ్గింది. మూడు నెలల్లో మొదటిసారి తగ్గుదల నమోదైంది. పారిశ్రామిక కార్యకలాపాలు తగ్గడంతోపాటు, వర్షాలు కురవడం వల్ల కూలింగ్ డిమాండ్ కూడా తగ్గింది.
గ్రిడ్ ఇండియా డేటా డైలీ అనాలసిస్ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఇదే నెలలో తయారీ రంగం విస్తరణ కూడా మందగించింది, వర్షాలు కురవడం కొనసాగింది. మన దేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు సగం వరకు పరిశ్రమలే వినియోగించుకుంటాయి. బొగ్గు ఆధారిత విద్యుత్తు మన దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో నాలుగింట మూడొంతులు ఉంటుంది. ఇది ఈ ఏడాది ఆగస్టుతో పోల్చుకుంటే, సెప్టెంబరులో తగ్గింది.