PM Modi | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగా ణ): సోలార్ వి ద్యుత్తుపై కేంద్రం కుట్రలు చేస్తున్నదని రెడో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచాల్సిన కేంద్రం, దాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.
సోలా ర్ పరికరాల మీద జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచారని, దిగుమతి సుంకాన్ని సైతం పెంచి ప్రజలకు సోలార్ విద్యుత్తును దూరం చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ తర్వాత సబ్సిడీలో భారీగా కోతలు విధించబోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం.. ఇండ్లకు ఒక కిలోవాట్ పీక్ సోలార్కు రూ.21,320 సబ్సిడీ ఉన్నదని, 15 తర్వాత అది రూ.14,588 తగ్గిస్తున్నారని తెలిపారు. మోదీ పుణ్యమా అని ధరాభారంతో ప్రస్తు తం దాదాపు 40 గిగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులు నిలిచిపోయాయని విమర్శించారు. మరో రెండు, మూడేండ్లలో సోలార్‌పై పూర్తిగా సబ్సిడీ ఎత్తేసే దిశగా కేంద్రం ఆలోచన చేస్తున్నదని ఆరోపించారు.