హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం హిట్లర్‌ను మించిన నియంతృత్వ పోకడలతో వెళ్తున్నదని రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. దేశంపై ఉత్తరాది ఆధిపత్యాన్ని మరింత పెంచేందుకు కుట్రలు చేస్తున్నదని, దక్షిణాదిపై హిందీని రుద్దేందుకు చాపకింద నీరులా ప్రయత్నిస్తున్నదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్కోడ్, cలే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్ సురక్షసంహిత, భారతీయసక్ష్యగా పేరొంటూ కేంద్రం లోక్‌సభలో బిల్లులు పెట్టడం వెనుక కుట్ర ఉన్నదని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషలతోపాటు హిందీని స్వాగతించాలంటూ ఇటీవల వ్యాఖ్యలు చేసిన అమిత్‌షా హిందీయేతర రాష్ట్రాలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే 1965 నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని మరోసారి చూడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.