హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా వివిధ క్యాటగిరీల్లో 663 గ్రూప్-2 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు (జీవోఎంఎస్ 145) ఇచ్చింది. ఆయా శాఖల్లో క్యాడర్లవారీ ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల వివరాలను టీఎస్పీఎస్సీకి అందజేయాలని ఉన్నతాధికారులు సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
విద్యుత్తు శాఖలో 11 పోస్టులు..
విద్యుత్ శాఖలో 11 అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.
పశుసంవర్ధకశాఖలో309 పోస్టులు..
పశుసంవర్ధక శాఖలో మొత్తం 15 పోస్టులు, వెటర్నరీ- పశుసంవర్ధక శాఖ కార్యాలయ డైరెక్టర్ పరిధిలో మరో 294 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

