Telangana | హైదరాబాద్ : రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ( Commercial Tax Dept )కు రికార్డు స్థాయిలో రాబడి వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరం( Finance Year )లో రూ. 72,525.59 కోట్ల రాబడి వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఆర్థిక ఏడాది 12 శాతం అధికంగా ఆదాయం సమకూరింది. గత సంవత్సరంలో రూ. 65,021.42 కోట్ల రాబడి వచ్చింది.
చమురు అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ. 14,987.44 కోట్లు, మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా రూ. 14,286.85 కోట్లు, వ్యాట్, జీఎస్టీ రాబడులు ఇతరత్రా రాబడులు రూ. 1088.80 కోట్లు సమకూరాయి. కేంద్ర, రాష్ట్ర జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి రూ. 38,101 కోట్ల రాబడి వచ్చినట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రకటించింది.