జ్యోతినగర్, ఏప్రిల్ 1: రామగుండం ఎన్టీపీసీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో శుక్రవారం నాటికి 16,059.30 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. ఈ ఏడాది నాలుగు రోజుల ముందే లక్ష్యాన్ని అధిగమించిందని సంస్థ అధికారులు తెలిపారు. 69.15 పీఎల్ఎఫ్తో 15,750 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయాలని యాజమాన్యం లక్ష్యాన్ని నిర్దేశించింది. 70.51 శాతం పీఎల్ఎఫ్తో టార్గెట్ను అధిగమించిన సంస్థ.. అదనంగా 309.3 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.