అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు
అంకితభావంతో ప్రజల కోసం అధికారులు పనిచేస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు.
- ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు గవర్నర్ దిశానిర్దేశం
హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అంకితభావంతో ప్రజల కోసం అధికారులు పనిచేస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. సోమవారం ఎంసీఆర్‌హెచ్చార్డీలో శిక్షణ పొందుతున్న 44మంది గ్రూప్-1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు, సంస్థ ఎండీ శాంతికుమారి ఆధ్వర్యంలో గవర్నర్‌ను లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలని సూచించారు.
సరస్వతి పుష్కరాలకు ఆహ్వానం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ నది అంత్య పుష్కరాలకు హాజరు కావాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లాకు దేవాదాయశాఖ ఆహ్వానం పలికింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆలయ అర్చకులు గవర్నర్‌ను లోక్‌భవన్‌లో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈపీసెట్ ర్యాంకర్ రుషికి అభినందన
తెలంగాణ ఈపీసెట్ ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థిని మల్లాడి రుషిని గవర్నర్ సోమవారం లోక్‌భవన్‌లో అభినందించారు. ఆమె కృషి, పట్టుదలతోపాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

