హైదరాబాద్, జనవరి 16 (నమస్తేతెలంగాణ): విద్యారంగం పటిష్టతపై హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టిపెట్టింది. కొత్త సిలబస్ రూపకల్పనకు విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణులు, విద్యార్థుల నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు.
www.tgche.ac.inలో అప్లోడ్ చేయాలని విజ్ఞప్తిచేశారు. టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, పరిశ్రమల కోసం పాఠ్యప్రణాళిక పునరుద్ధరణ, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సూచనలివ్వాలని విన్నవించారు.
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో పాఠ్యాంశాలు రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. త్వరలోనే ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తీసుకురానున్నామని పేర్కొన్నారు.