హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు గురువారం నుంచి రీడింగ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. పాఠశాల విద్యాశాఖ, రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్టులు సంయుక్తంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నారు. నేడు ప్రారంభం కానున్న ఈ క్యాంపెయిన్ సెప్టెంబర్ 8 వరకు కొనసాగుతుంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్, జాయింట్ డైరెక్టర్ రాజీవ్, రూమ్ టూ రీడ్ ప్రతినిధి నరసింహాచారి బుధవారం పోస్టర్‌ను ఆవిష్కరించి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.