హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ డిజిటల్ ఆన్స్రీన్ మూల్యాంకనానికి మళ్లీ టెండర్లు పిలువాలని అధికారులు నిర్ణయించారు. గతంలో దాఖలైన టెండర్ టెక్నికల్ ప్రపోజల్స్‌ను సోమవారం తెరిచారు. ఒకే ఒక బిడ్డర్ పాల్గొన్నట్టు గుర్తించారు. దీంతో మళ్లీ కొత్త టెండర్లు పిలువాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు.
మూడు రోజులు వర్క్‌షాప్
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ, మాడల్ పేపర్లపై అన్ని జిల్లాల అధికారులతో మూడు రోజుల వర్క్‌షాప్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 17 వరకు జరిగే టెలికాన్ఫరెన్స్‌ను టీ శాట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు తెలిపింది. పదో తరగతికి బోధించే టీచర్లు, మండల, జిల్లా స్థాయి అధికారులు ఈ ప్రసారాన్ని చూడాలని సూచించారు.