Shubham Ranjane : స్వదేశంలో ఆరంభమైన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి లీగ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. గత సీజన్లో సంచలన విజయాలతో సూపర్ సిక్స్‌కు దూసుకొచ్చిన యూఎస్ఏ(USA)తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి భారత స్టార్లపైనే ఉండగా.. అమెరికా జట్టులోని శుభమ్ రంజనే (Shubham Ranjane) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. కారణం ఏంటంటే.. ఒకప్పుడు అతడు ముంబై జట్టుకు ఆడాడు. ఇప్పుడు విశ్వ వేదికపై అదే ముంబైలోని వాంఖడే స్టేడియంలో అతడు టీమిండియాతో తలపడనుతున్నాడు. స్వదేశం విడిచి.. కొత్త జట్టుకు ఆడాల్సి రావడంపై శుభమ్ ఏం చెప్పాడంటే..?
ఆల్‌రౌండర్‌గా అమెరికా వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్న శుభమ్ రంజనే సొంతగడ్డపై ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాడు. ఒకప్పుడు ముంబై తరఫున ఆడిన అతడు.. శనివారం సాయంత్రం తొలి లీగ్ మ్యాచ్‌లో యూఎస్ఏ జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. వాంఖడేలో ప్రాక్టీస్ సందర్భంగా పాత రోజులను గుర్తు చేసుకున్న శుభమ్.. అవకాశాలు రాకనే అమెరికా వెళ్లానని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో చెప్పాడు.
Shubham Ranjane played for Mumbai. Now, he is on the verge of playing for the USA in Mumbai.
Mumbai’s deep batting line-up, which included India Surya, Rahane, Tare, Nayar, Shreyas did not allow him enough opportunities to bat up the order.
Restless and itching to continue… pic.twitter.com/kQuTJJFXtK
— ESPNcricinfo (@ESPNcricinfo) February 7, 2026
‘వరల్డ్‌కప్‌లో ఆడాలనేది నా చిన్నప్పటి కల. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. స్వదేశం వచ్చి భారత జట్టుతోనే తలపడడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. అప్పట్లో ముంబై జట్టులో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండేది. సూర్యకుమార్ యాదవ్, అజింక్యా రహానే, ఆదిత్య తారే, అభిషేక్ నాయర్, శ్రేయాస్ అయ్యర్, సిద్దేశ్ లాడ్.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ దుర్భేద్యంగా ఉండేది. అలాగనీ నాకు అవకాశాలు రాలేదని చెప్పను. కానీ, ఆ సమయంలో బ్యాటింగ్ యూనిట్లో నాకు మిడిలార్డర్ ఆల్‌రౌండర్‌గా చోటు దక్కలేదు. ఆ రోజుల్లో నా ప్రతిభను, శక్తి సామర్థ్యాలను చాటలేకపోయాను. అందుకని నేను నిరుత్సాహపడలేదు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లాను. అక్కడ క్లబ్ క్రికెట్లో రాణించి వరల్డ్‌కప్ బెర్తు సాధించాను’ అని తన కెరీర్లో టర్నింగ్ పాయింట్‌ను పంచుకున్నాడు శుభమ్.
నాలుగేళ్ల క్రితం ఆగస్టు 22న శుభమ్ తన భార్య మౌసమ్ పటేల్‌తో కలిసి అమెరికాలో వాలిపోయాడు. అక్కడి సియాటెల్‌లో దిగిన అతడు.. అమెరికా టీ20 లీగ్.. మేజర్ లీగ్ క్రికెట్(MLC)లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. 2023లో ఐపీఎల్ జట్ల యజమానులు కొందరు ఈ లీగ్‌లో భాగం కాగా.. రంజనేకు అవకాశం వచ్చింది.
యూఎస్ఏ టీ20 ప్రపంచకప్ స్క్వాడ్ : శ్యాయన్ జహంగీర్, సాయితేజ ముక్కమల్ల, మొనాక్ పటేల్(కెప్టెన్), ఆండ్రియస్ గౌస్, మిలింద్ కుమార్, షేహాన్ జయసూర్య, హర్మీత్ సింగ్, శుభమ్ రంజనే, షాడ్లే వాన్ షాల్క్విక్, మొహమ్మద్ మొహ్సిన్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగే.