ఒకే నెలలో ఏడుగురు నేరస్థుల రీసరెండర్
నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇన్నాళ్లూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు ఇప్పుడు నేరుగా వచ్చి కోర్టుల్లో రీ-సరెండర్ అవుతున్నారు. ఇలా ఒక్క నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ కావడం గమనార్హం.
- ఫలిస్తున్న సీఐడీ సీఎంఎస్ టీమ్ కృషి : ఏడీజీ మహేశ్ భాగవత్
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): నాన్ బెయిలబుల్ కేసుల్లో ఇన్నాళ్లూ పోలీసుల కండ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులు ఇప్పుడు నేరుగా వచ్చి కోర్టుల్లో రీ-సరెండర్ అవుతున్నారు. ఇలా ఒక్క నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ కావడం గమనార్హం. తెలంగాణ సీఐడీ విభాగం నాన్ బెయిలబుల్ వారెంట్ల కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఏడీజీ మహేశ్ భాగవత్ నేతృత్వంలోని కోర్టు మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎస్) విభాగాన్ని ఏర్పాటు చేసింది. 88 కేసులను వీరు సవాల్‌గా తీసుకున్నారు.
తిరుగుతున్న నేరస్థుల్లో 19 మందిని సీఎంఎస్ విభాగం ఎస్పీ రాంరెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. దేశ, విదేశాల్లో ఉంటూ తప్పించుకొని తిరుగుతున్న నేరస్థులను సులువుగా అరెస్టు చేసి కోర్టుకు సరెండర్ చేస్తున్నారు. పలు కేసుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి, తప్పించుకు తిరుగుతున్న వారు తిరిగి కోర్టుల్లో లొంగిపోతున్నారు. ఇలా ఈ నెలలోనే ఏడుగురు కోర్టుకు రీసరెండర్ అయినట్టు సీఐడీ ఏడీజీ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

