ధర్మసాగర్, అక్టోబర్ 14: ఎమ్మెల్యే క డియం శ్రీహరి అనుచరుడు ధర్మసాగర్‌కు చెందిన రావుల వెంకట్‌రెడ్డి తనను చంపుతానని బెదిరిస్తున్నాడని రావుల నీరజ్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ధర్మసాగర్లో మీడియాతో మాట్లాడుతూ… కొద్ది ఏండ్లుగా రావుల వెంకట్‌రెడ్డికి తమకు మధ్య 6గుంటల స్థలం విషయంలో వివాదం కొనసాగుతున్నదని, దీనిపై కోర్టులో కేసు నడుస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో బెదిరింపులకు గురిచేస్తున్నాడని వాపోయాడు. దీంతో పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. వెంకట్‌రెడ్డి, అతడి అనుచరుడితో ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.