మెట్పల్లి రూరల్, నవంబర్ 28: జగిత్యా ల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బా లుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు అందజేస్తున్న ఆహార నాణ్యతపై అనుమానాలు నెలకొన్నాయి. వంటగది ఎలుకల సంచారానికి నిలయంగా మారింది. ఇటీవల అధికారులు గురుకులాన్ని సందర్శించి వి ద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.
బఠాణీలు, పప్పు, శనగలు పురుగు లు పట్టి ఉండడం, బియ్యం సంచులపై ఎలుకల వ్యర్థాలున్నట్లు బయటపడడంతో 4 రోజుల క్రితం కలెక్టర్ సత్యప్రసాద్ గురుకు లం ఫుడ్ ఇన్చార్జిని సస్పెండ్ చేశారు. బుధవారం వంటగదిని శుభ్రపరుస్తుండగా బియ్యం సంచుల వద్ద ఎలుక పిల్లలు బయటపడ్డాయి. దీనికి తోడు మెనూ ప్రకారం గుడ్లు పెట్టడం లేదని, కూరలు పల్చగా ఉంటున్నాయని, అన్నానికి సరిపడా కూర పెట్టడం లేదని విద్యార్థులు అధికారులకు తెలిపినట్టు సమాచారం.