ఖైరతాబాద్, సెప్టెంబర్ 3: ఐదు నెలల నుంచి ప్రభుత్వం కమీషన్లు చెల్లించడం లేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేశ్‌బాబు చెప్పారు. బుధవారం సోమా జిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి రేషన్ డీలర్‌కు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్లు పెంచుతా మని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింద ని తెలిపారు.
కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా పెంచలేదని, ఉన్న కమీషన్లు కూడా ఇవ్వడం లేదని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమాండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి కిరణ్‌కుమార్ రెడ్డి, బత్తుల మహేశ్ తదితరులు పాల్గొన్నారు.