సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 23 : రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలని జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్త పేరిట బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో ఓ పోస్టర్ ఏర్పాటు చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డికి మా సమస్య తెలియజేస్తున్నది ఏమనగా.. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో మాకు రేషన్‌కార్డులు రాలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా వస్తాయని సంతోషించాం. నేను ఒక కూలీని. నాకు లేబర్‌కార్డు కావాలని ఆఫీస్‌కు వెళ్తే రేషన్‌కార్డు ఉంటేనే లేబర్‌కార్డు వస్తదన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలకు మేము అనర్హులుగా ఉన్నాము. నా లాంటి పేద ప్రజలు రేషన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. మా పేద ప్రజల సమస్యలు గుర్తించి రేషన్ కార్డులు జారీ చేయగలరు. నువ్వు తెలివి ఉన్న సీఎం అయితే రేషన్ కార్డుల సమస్యలు తీర్చు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయకండి. ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. సీఎం రేవంత్‌రెడ్డి’ అంటూ పోస్టర్లో రాసి ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది.