న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్‌కు ఆమె స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ముర్ము ఆకాంక్షించారు. కాగా, ఇవాళ రాష్ట్రంలో సీఎం పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు.