హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ నిందితుడిగా ఉన్న పోక్సో కేసులో బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని యాంకర్ రష్మీ గౌతమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తాను చెప్పాల్సింది చెప్పానని, నచ్చినా నచ్చకపోయినా అది మీ ఇష్టం అంటూ తనను ట్రోలింగ్ చేసే వారికి చురకలు అంటించారు. సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ అంశంలో తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూడటంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరారు. తన దృష్టిలో లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి మరణశిక్షే సరైనదని ఆమె అభిప్రాయపడ్డారు.