కడెం ;నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ రేంజ్ పెద్దవాగు పరిసరాల్లో అటవీ అధికారులు అరుదైన కప్పను గుర్తించారు. కవ్వాల్ టైగర్ రిజర్వు పరిధిలో డీఆర్వో ప్రకాశ్, ఎఫ్బీవో ప్రసాద్ గస్తీ తిరుగుతున్న సమయంలో వింత కప్ప కనిపించడంతో ఫొటోలు తీశారు. ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్, శ్రీలంక బుల్ ఫ్రాగ్ పేర్లతో పిలిచే ఈ కప్ప చాలా తక్కువ ప్రాంతాల్లో కనిపిస్తుందని అధికారులు పేర్కొన్నారు. మొదటిసారి కడెం అటవీ ప్రాంతంలో వీటిని గుర్తించి, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు డీఆర్వో తెలిపారు. –