సంగారెడ్డి, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ) : గద్ద జాతికి చెందిన అరుదైన అమూర్ ఫాల్కన్ పక్షి సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేట చెరువు వద్ద శనివారం ప్రత్యక్షమైంది. మినియేచర్ మారథానర్గా పిలుచుకునే ఫాల్కన్ ఇంతకుముందు జిల్లాలో ఎక్కడా కనిపించలేదని మొదటిసారిగా కిష్టారెడ్డిపేట వద్ద ప్రత్యక్షమైందని అమీన్‌పూర్‌కు చెందిన పక్షి ప్రేమికుడు ఒకరు తెలిపారు.
అమూర్ ఫాల్కన్ సైబీరియా, ఉత్తర చైనాలో సంతానోత్పత్తి చేసి భారత్‌లోని నాగాలాండ్, మణిపూర్ రాష్ర్టాలకు శీతాకాలంలో చేరుకుంటుంది. ఇక్కడ కొంతకాలం గడిపిన తర్వాత ఈశాన్య రాష్ర్టాలు, మహారాష్ట్ర మీదుగా ఆరేబియా సముద్రంపై నుంచి ఎగురుకుంటూ ఎక్కడా ఆగకుండా 6100 కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికా చేరుకుంటుంది. ఫాల్కన్పై వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు.