Braille Lipi | హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : బ్రెయిలీ లిపిలో రూపొందించిన రామాయణ, హనుమాన్ చాలీసా గ్రంథాలను ఆయోధ్య రామమందిర్ మ్యూజియానికి అందించినట్టు దేవనార్ ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ డాక్టర్ ఎ సాయిబాబా గౌడ్ తెలిపారు. ఉషశ్రీ బెయిలీ లిపిలో రచించిన ఈ గ్రంథాలను టీటీడీ ధ్రువీకరించినట్టు పేర్కొన్నారు.
ఒక్కొక్క గ్రంథం 6 సంపుటాలు ఉన్నాయని చెప్పారు. అయోధ్యను సందర్శించే అంధులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ రెండు గ్రంథాలను ఆరు సంపుటాల చొప్పున రిజిస్టర్ పోస్టులో ఆయోధ్య రామమందిర్ లైబ్రరీకి పంపినట్టు సాయిబాబా గౌడ్ తెలిపారు.