Ramappa | యునెస్కో వారసత్వ సంపద రామప్ప దేవాలయంలో మంగళవారం ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలకు నిర్వహించనున్నారు. వేడుకలకు సంబంధించి అధికారులన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ డీఆర్వో రమాదేవి, టూరిజం, టీఎస్‌టీడీసీ అధికారులు సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ హాజరుకానున్నారు.
సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, డ్రమ్మర్ శివమణి, గాయకుడు కార్తీక్, ఫ్లూటిస్ట్ నవీన్‌తో పాటు బలగం చిత్రబృందం సైతం ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వేడుకలకు హాజరయ్యే వారికి కోసం ములుగు పట్టణం నుంచి రామప్ప ఆలయం వరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ‘శిల్పం, వర్ణం, కృష్ణం’ థీమ్‌తో జరుగనున్నారు. అశోక్ గురజాలే నేతృత్వంలో ఆరాభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వారిచే వయోలిన్ సింఫనీ, ప్రదర్శన పేరిణి రాజ్‌కుమార్, ఆయన బృందంతో పేరిణి నృత్య ప్రదర్శన జరుగనున్నది.