హైదరాబాద్, జూలై 3(నమస్తే తెలంగాణ): టెట్ ఫలితాలలో రామయ్య ఇన్స్టిట్యూట్ నంబర్ వన్ స్థాయిలో నిలిచిందని డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ తెలిపారు. తమ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు టెట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకుతోపాటు అత్యధిక ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. స్టేట్ ఫస్ట్ ర్యాంకుల విద్యార్థులను ఆయన సన్మానించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల వల్లనే ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయని లక్ష్మీనారాయణ తెలిపారు.