KCR | హైదరాబాద్ : ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ పార్టీ చీఫ్, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు కలిసి కేసీఆర్కు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. ఈ రాఖీ వేడుకల్లో కేసీఆర్ సతీమణి శోభ, అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ పాల్గొన్నారు.
రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాఖీ కట్టిన అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ. pic.twitter.com/AHeElhN6Ft
— BRS Party (@BRSparty) August 9, 2025