ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్ కొండూరుసత్యనారాయణ
హైదరాబాద్, మే24 (నమస్తే తెలంగాణ): వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంబీసీ సంఘాల సమితి జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ప్రశ్నిం చే గొంతుక రాకేశ్‌రెడ్డి అని కొనియాడారు. రాకేశ్‌రెడ్డి గెలుపుకోసం మున్సిపల్ కో ఆప్షన్లు, బీసీ, ఎంబీసీ నాయకులు కృషి చేయాలని కోరారు.