తిరుపతి : తిరుమల శ్రీవారిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబసభ్యులతో కలిసి స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామివారని దర్శించుకొని మొక్కులు చెల్లంచుకున్నారు.
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వద్దిరాజు దంపతులకు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యునిగా ఎన్నకై,పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.