వనస్థలిపురం, జూలై 23: రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నాయకోటి రాజు ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని హస్తినాపురం కేకే గార్డెన్స్‌లో ఎన్నికలు నిర్వహించారు. సమీప అభ్యర్థి పోరెపల్లి నాగరాజుపై ఆయన 28 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారు. తనను గెలిపించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.