హైదరాబాద్, మార్చి22 (నమస్తే తెలంగాణ): ఆర్థికంగా వెనుకబడిన తరగతులు(ఈబీసీ), ఆర్థికంగా బలహీనవర్గాల(ఈడబ్ల్యూఎస్)కు చెందిన వారికి సైతం ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని వర్తింపజేస్తున్నారు.
బీసీ సంక్షేమశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వ్యక్తులు ఆర్థిక సాయం కోసం ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 5లోగా https://tgobmmsnew.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.