Rajiv Yuva Vikasam | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఊరించిన రాజీవ్ యువ వికాసం పథకం యువతను ఉసూరుమనిపిస్తున్నది. దరఖాస్తు ప్రక్రియ ప్రహసనంలా కొనసాగుతున్నది. ఒకవైపు ప్రభు త్వం ఆదా య ధ్రువీకరణ పత్రం మెలిక పెట్టగా, మరోవైపు రెవెన్యూ అధికారులు సదరు పత్రాలను జారీ చేయడంలో తాత్సా రం చేస్తున్నారు. ఇక సర్వర్ సైతం మొరాయిస్తుండడంతో నిరుద్యోగ యువత ఇబ్బందులకు గురవుతున్నది. రేపటి (సోమవారం)తో దరఖాస్తులకు తుది గడువు ముగిసిపోనుండగా, ఇప్పటికీ ఇంకా లక్షలాది మంది ఆశావహులు దరఖాస్తు కోసం ఎదురుచూస్తున్నారు. గడువు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవ్వని కార్డులు తెచ్చేదెలా?
యువవికాసం పథకంలో ప్రభుత్వం విధించిన నిబంధనలు విమర్శలు తావిస్తున్నాయి. ఆదాయ సర్టిఫికెట్లను, లేదంటే రేషన్‌కార్డులను కచ్చితంగా పొందుపరచాలని ప్రభుత్వం తెలిపింది. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయకపోకవడంతో చాలా మంది ఆదాయ సర్టిఫికెట్ల కోసం పరుగులు తీస్తున్నారు.
మొరాయిస్తున్న సర్వర్
ప్రభుత్వం యువవికాసం దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరిస్తున్నది. ఆధార్‌కార్డు. రేషన్‌కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రం నంబర్లను ఎంట్రీ చేయడంతోపాటు, ఫొటోలను అప్లోడ్ చేయాల్సి ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్‌ను సమర్పించిన తర్వాత దానిని డౌన్లోడ్ చేసుకుని, ధ్రువీకరణ పత్రాలను జతచేసి మండల కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంది. అయితే సర్వర్లు మొరాయిస్తునాయి.
ఆధార్ కార్డు ఒకరిది.. పేరు ఇంకొకరిది
గంగాధర, ఏప్రిల్ 12: కరీంనగర్ జిల్లా గంగాధరలో యువవికాసంలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన మోహన్‌కు వింత అనుభవం ఎదురైంది. తన ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేయగానే అదే నెంబర్‌తో కురిక్యాల గ్రామానికి చెందిన మహిళ దరఖాస్తు చేసుకున్నట్టు ఆన్లైన్లో చూపించింది. తన రేషన్ కార్డు నెంబర్‌తో ఎంటర్ చేసి చూసినా ఆ మహిళ పేరునే దరఖాస్తు చేసుకున్నట్టు ఆన్లైన్లో చూపిస్తున్నదని తెలిపాడు. దీనిపై బీసీ కార్పొరేషన్ కార్యా లయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు.