హైదరాబాద్, జనవరి 1(నమస్తే తెలంగాణ) : గ్లోబల్ ఎంటర్ప్రెన్యూరల్ నెట్వర్క్ అనుబంధ టీఐఈ(ది ఇండస్ అంత్రప్రెన్యూర్స్) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా పగడాల కన్స్ట్రక్షన్స్ ఎండీ రాజేశ్ పగడాలను, ఉపాధ్యక్షుడిగా ఇన్నోబాక్స్ సీఈవో కాకర్ల మురళిని నియమించారు. శ్రీనీ చందుపట్ల నుంచి రాజేశ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 1992లో ఏర్పాటైన టీఐఈకి రాజేశ్ 15వ అధ్యక్షుడు. ప్రపంచవ్యాప్తంగా శాఖలు కలిగివున్న టీఐఈ.. ఎటువంటి లాభాపేక్ష లేకుండా అంత్రప్రెన్యూర్స్కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుంది.