హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎం రాజేందర్‌రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. మూడేండ్లపాటు లేదా ప్రభుత్వం జారీచేసే తదుపరి ఉత్తర్వుల వరకు రాజేందర్‌రెడ్డి ఆ పదవిలో కొనసాగుతారని న్యాయశాఖ కార్యదర్శి రేండ్ల తిరుపతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఉమ్మడి రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా ఉన్నారు. జాతీయ బార్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ప్రతాప్‌రెడ్డి సుదీర్ఘకాలం పనిచేశారు. భారీ సంఖ్యలో కేసుల పరిషారానికి చర్యలు తీసుకున్నారు. తనను పీపీగా నియమించి సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు న్యాయమూర్తులకు, పోలీస్ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.