హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో మహిళలకు గౌరవం, భద్రత లేదని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ విమర్శించారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకు అవమానం, బయట మహిళలపై అఘాయిత్యాలు కాంగ్రెస్ పాలనకే చెల్లాయని పేర్కొన్నారు. యావత్ తెలంగాణ మహిళాలోకాన్ని అవమానించేలా అసెంబ్లీలో మంత్రులు మాట్లాడారన్నారు. మహి ళా ఎమ్మెల్యేలకు సీఎం, మంత్రులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దురహంకారానికి నిదర్శనం: దశరథ్
అసెంబ్లీలో సబితాఇంద్రారెడ్డిపై సీ ఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ పేర్కొన్నారు. శాసనసభ సంసృతికి మచ్చతెచ్చేలా రేవంత్ ప్రవర్తిస్తున్నారని విమర్శించా రు. సీనియర్ ఎమ్మెల్యే పై సీఎం మాట లు ఆయన దురహంకారానికి నిదర్శనమని చెప్పారు. మూలాలు మరిచి మా ట్లాడుతున్నారని విమర్శించారు.