ఖైరతాబాద్, ఆగస్టు 25: ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రజల మధ్య మత చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రవాదులు, నక్సలైట్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తి అని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం విమర్శించారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేసి, తక్షణం అతన్ని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని, జీవిత కాలం జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి మత రాజకీయాలే ముఖ్యమని ఆరోపించారు. రాజాసింగ్, బండి సంజయ్ వల్ల రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా బతికే పరిస్థితి లేకుండా పోయిందని, మత కల్లోలాలు సృష్టించడం తప్ప వారికి ప్రజల బాగోగుల అవసరం లేదని విమర్శించారు. శుక్రవారం స్పీకర్, డీజీపీని కలిసి రాజాసింగ్‌పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.