సిరిసిల్ల టౌన్/ఇల్లంతకుంట, అక్టోబర్ 13: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ పలు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్కు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లతో నేతన్నలకు బతుకునిచ్చిన కేటీఆర్కు ఎన్నికల్లో భారీ మెజార్టీనిస్తామని పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి దేవదాస్ స్పష్టం చేశారు.