రాజన్న సిరిసి ల్ల, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా వైద్యు డు సందుగ అనిల్‌కుమార్ (64) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. సిరిసిల్లలో అనిల్‌కుమార్ ప్రజా వైద్యశాల పేరుతో దవాఖాన ఏర్పాటు చేశారు. తన వైద్యసేవలతో ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన రెండ్రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. దవాఖానలో చేర్పించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. అనిల్‌కుమార్ మృతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు.