హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌గా బీ రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సమాచార శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేసి, రిటైరైన రాజమౌళి రెండేండ్లపాటు డైరెక్టర్‌గా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తనను రాష్ట్ర సమాచారశాఖ డైరెక్టర్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్‌లో సీఎంను మంగళవారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.