హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసును పోలీసులు సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు ‘జగజ్జనని’ పేరుతో చిట్‌ఫండ్ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారే విషయం బయటకు వచ్చింది. నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్లు, చిట్స్ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినటట్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. దీంతో జగజ్జనని చిట్‌ఫండ్స్ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.