హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ర్టంలో రాగల మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అల్పపీడనం వాయుగుండంగా బలపడి మద్రాసుకు తూర్పు, ఆగ్నేయ దిశలో సుమారు 130 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నదని పేర్కొన్నది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి గురువారం రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నదని తెలిపింది. మరో అల్పపీడనం ఈ నెల 13న దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.