హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మంగళవారం నాడు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్-మలాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అకడకడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేరొంది.