Weather Update | హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. గురువారం నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి శ్రీలంక, తమిళనాడు తీరం దిశగా పయనిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు రాష్ర్టాల్లో ఈ నెల 13 వరకు అకడకడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. 14న లేదా 15న మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు అంచనా వేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా, హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
భీంపూర్లో 11డిగ్రీలు..
ఆదిలాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భీంపూర్ మండలం అర్లి(టీ)లో మంగళవారం 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతగా రికార్డయ్యింది.
దాసర్పల్లిలో భూకంప తీవ్రత పరిశీలన
దేవరకద్ర రూరల్ (కౌకుంట్ల), డిసెంబర్ 10 : మహబూబ్నగర్ జి ల్లా కౌకుంట్ల మండలం దాసర్పల్లి గ్రామంలో ఈ నెల 7న స్వల్ప భూ కంపం వచ్చింది. దీంతో మంగళవా రం భూకంప విభాగం డైరెక్టర్ సంగ్రామ్నాయక్, జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త రమేశ్గుండ గ్రామాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరు రోజులు గా ములుగు, వరంగల్ తదితర ప్రాం తాల్లో భూకంపం వచ్చిన ప్రాంతాలను పరిశీలించామని, చివరగా దాసర్పల్లికి వచ్చినట్టు తెలిపారు. ఒకసారి భూకంపం వచ్చిన తరువాత.. కొన్ని రోజులు లేదా కొన్ని గంటల్లో మళ్లీ వ చ్చే అవకాశాలు ఉంటాయని చెప్పా రు. ఇక్కడి తీవ్రతకు, గతంలో వచ్చి న వాటికి ఏమైనా సంబంధాలున్నా యా? అనే విషయాలను పరిశీలించి, రెండు, మూడ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు.