హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా ఎన్నికల ఓట్లర జాబితా రూపకల్పనపై భారీ వర్షాల ప్రభావం పడింది. గతంలో ప్రకటించిన ఓటరు జాబితా షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సవరించింది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో జిల్లా యంత్రాంగం, క్షేత్ర స్థాయి సిబ్బంది.. సహాయక చర్యలు, పునరావాసం, పునరుద్ధరణ తదితర పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. దీంతో ఓటర్ల జాబితా గడువును మార్చినట్టుగా ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. వార్డులు, పంచాయతీల ముసాయిదా ఓటరు జాబితాను ఈనెల 13న ప్రదర్శిస్తామని, తుది ఓటరు జాబితాను ఈ నెల 28న ప్రకటిస్తామని తెలిపారు. ఆయా వివరాలు కిందివిధంగా ఉన్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 5(నమస్తే తెలంగాణ): నేషనల్ ఓల్డ్ పెన్షన్ రీస్టోరేషన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాచన రఘునందన్ నియామకం కానున్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ కోసం ఎన్వోపీఆర్‌యూఎఫ్ దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిం దే. 16న న్యూఢిల్లీలో నిర్వహించే స మావేశంలో ఫ్రంట్ జాతీయ అధ్యక్షు డు బీపీ రావత్ అధికారికంగా ప్రకటించనున్నట్టు రఘునందన్ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్5 (నమస్తే తెలంగాణ): బోర్డు నిర్వహణకు వెంటనే నిధులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అతుల్‌జైన్, మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే విజ్ఞప్తి చేశారు. జలసౌధకు విచ్చేసిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఆయన చాంబర్లో గురువారం ప్రత్యేకంగా కలిశారు. బోర్డుకు తెలంగాణ సర్కారు చెల్లించాల్సిన బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. అందుకు మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు.